యాదాద్రిలో పెను ప్రమాదం తప్పింది. ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో ఎవరూ రాకపోవడంతో ప్రమాదం తప్పింది. కొండ చరియలు విరిగిపడ్డ దగ్గర నుంచి రోడ్డు మార్గాన్ని అధికారులు మూసేసి సహాయక చర్యలు చేపట్టారు. మొదటి ఘాట్ రోడ్డు నుంచి భక్తులను అనుమతిస్తున్నారు. యాదాద్రి దేవాలయం పనులు పూర్తి కావచ్చాయి. ఈ సమయంలో ఇటువంటి ప్రమాదం జరగడంతో అంతా షాకయ్యారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఈ ప్రమాదం జరిగిందని, భవిష్యత్ లో ఇటువంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు
Flash News : యాదాద్రిలో విరిగిపడ్డ కొండచరియలు .. కారణమిదే
Broken landslides in Yadadri