ఘోరం..మైనర్ బాలికపై తండ్రి, అన్న, తాత, మేనమామ లైంగిక దాడి

brother, grandfather and uncle sexually assaulted the minor girl

0
77

దేశంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. దుర్మార్గుల నుండి కాపాడాల్సిన కుటుంబసభ్యులే సభ్యసమాజం తలదించుకునే ఘటనలకు పాల్పడడం సిగ్గుచేటు. తాజాగా మహారాష్ట్రలోని పుణేలో అమానవీయ ఘటన జరిగింది. కంటికి రెప్పలా  కాపాడాల్సిన తండ్రి, రక్షణ ఇవ్వాల్సిన అన్న, తాత, మేనమామ ఇలా అందరూ కీచకులుగా మారారు. ఒకరికి తెలియకుండా ఒకరు తండ్రి, సోదరుడు 5 ఏళ్లుగా మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది. ఇటీవల పాఠశాలలో ‘గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌’ అనే అంశాన్ని విద్యార్థులకు వివరించడంతో ఈ విషయం బయటపడింది.