అన్న భార్యని వివాహం చేసుకున్న తమ్ముడు – ఊరంతా శభాష్ అంటున్నారు ఎందుకంటే

భర్తపై స్టేషన్ లో కేసు పెట్టింది

0
88

ముజురనగర్ లో ఓ వ్యక్తి సోదరుడు ఎవరూ తీసుకోని నిర్ణయం తీసుకున్నాడు. ఏడు నెలల క్రితం ఆ వ్యక్తి అన్నయ్యకి రుబి అనే అమ్మాయితో వివాహం జరిగింది. అయితే తల్లిదండ్రుల పోరు పడలేక ఈ వ్యక్తి రుబిని వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆమెతో ఎలాంటి భార్య భర్త సంబంధం పెట్టుకోలేదు. చివరకు తనతో భర్త ఇలా ఉంటున్నాడు అని ఆమె కూడా అత్తమామలకు తన తల్లిదండ్రులకి చెప్పలేదు.

అయితే ఆ వ్యక్తి తమ్ముడికి అన్న వదిన ఇలా గొడవ పడుతున్నారు అనే విషయం తెలిసిందే. అయితే ఓరోజు రుబి భర్త తన చిన్ననాటి స్నేహితురాలు సమీరని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. నీకు నాకు పెళ్లి అయింది అంతేకాని భార్య భర్తల సంబంధం జరగలేదు కాదా అని పెద్ద మనుషుల్లో పెట్టాడు. నా పేరెంట్స్ గొడవ పడలేక నిన్ను పెళ్లి చేసుకున్నా అని రుబితో అన్నాడు.

చివరకు ఆమె కూడా భర్తపై స్టేషన్ లో కేసు పెట్టింది. ఆమెకి ఎలాంటి ఇబ్బంది లేకపోతే తాను పెళ్ళి చేసుకుంటాను అని చెప్పాడు ఆమె మరిది. ఆమె ఒకే అంది. ఆమె మరిది ఇలా అన్న భార్యని వివాహం చేసుకున్నాడు. అయితే ఇక్కడ ఆమె వయసు 22 సంవత్సరాలు అతని వయసు 29 సంవత్సరాలు. ఇక రుబి తన మొదట భర్తకి విడాకులు ఇచ్చి వివాహం చేసుకుంది.