ఫ్లాష్: దారుణం..కన్నకొడుకును చంపి ఆపై తల్లి ఆత్మహత్య

0
99

తెలంగాణాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఈ మధ్యకాలంలో చిన్నచిన్న బాధలను తట్టుకోలేక తమ ప్రాణాలను తామే బలితీసుకోవడానికి కూడా వెనుకాడడం లేరు. తాజాగా ఇలాంటి ఘటనే నల్గొండ జిల్లాలో చోటుచేసుకోవడంతో పరిసరప్రాంతాల్లో తీవ్ర విహదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వేళైతే..న‌ల్ల‌గొండ జిల్లాలోని నార్క‌ట్‌ప‌ల్లి మండ‌లం ఔరావాణిలో రెండేళ్ల సాత్విక్ అనే  కన్నా కొడుకునే చంపి ఆపై లాస్య అనే తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరిని కన్నీరు పెట్టుకునేలా చేసింది.

ఈ ఘటన వివరాలను స్థానికులు పోలీసులకు సమాచారం తెలియజేయడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసుల ఈ ఆత్మహత్యలకు కారణాలేంటనే కోణంలో విచారిస్తున్నారు. పోలీసులు వారి మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమట్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు గల కారణాల కోసం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.