ఏపీలో దారుణ హత్య..రాయితో కొట్టి చంపిన హంతకులు

Brutal murder in AP .. Assassins who were stoned to death

0
110

దేశంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. భూ వివాదాలు, పాత కక్షలు, కుటుంబకలహాలతో, మద్యం మత్తులో హత్యలు చేయడానికి వెనకాడడం లేదు. తాజాగా ఏపీలో జరిగిన ఓ హత్య స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే..విశాఖలోని పితాని దిబ్బ ప్రాంతంలో ముగ్గురు స్నేహితులు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ ముగ్గురు నిత్యం కలిసి మద్యం సేవిస్తూ ఉంటారు. తాజాగా మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో ప్రసాద్ మరో ఇద్దరు స్నేహితుల కలిశాడు. అనంతరం వారంతా సమీపంలో గల గ్యాస్ ఏజెన్సీ వద్ద గల ఖాళీ ప్రదేశానికి వెళ్లి మద్యం సేవించారు.

మద్యం సేవించిన అనంతరం వారి మధ్య వాగ్వివాదం చెలరేగింది. దీనితో మిగతా ఇద్దరూ ప్రసాద్ అనే వ్యక్తి తలపై రాయితో కొట్టి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ప్రసాద్ హత్యకు కారకులైన పైడి రాజు, శివ ప్రసాద్ లను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.