హైదరాబాద్ లో దారుణ హత్య..

0
108

హైదరాబాద్ లో హృదయవిదారక ఘటన చేటుచేసుకుంది. ఇప్పటికే ఎంతో మంది హత్యలు, ఆత్మహత్యలు చేసుకొని గ్రామాల్లో తీరని విషాదాన్ని మిగిల్చారు. తాజాగా ఓ భర్త తన భార్యను అతి కిరాతకంగా చంపిన ఘటన జూబ్లీహిల్స్ లో చోటుచేసుకోవడంతో పరిసరప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే..2020లో ఓ వ్యక్తి ఓ మహిళలను పెళ్లిచేసుకోగా..ఆమెను అతి కిరాతంగా హతమార్చి రెండో భార్యను ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. ఈ కుటుంబం జూబ్లీహిల్స్ లోని ఎస్‌పీఆర్ హిల్స్‌ లో నివాసం ఉంటుండగా..రెండో భార్యను కూడా అతి కిరాతకంగా చంపాడు. చంపిన అనంతరం డ్రమ్ములో పెట్టి దానిపై దుస్తులు కప్పి వెళ్లిపోవడంతో డెడ్ బాడీ నుంచి దుర్గంధం వచ్చి అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం తెలియజేసారు.

దాంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా..నాలుగు రోజుల క్రితమే ఈ హత్య జరిగినట్టు ప్రాధమికంగా నిర్దారించారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలు ఏంటనే అంశంపై పోలీసులు శ్రద్ధ పెట్టి దర్యాప్తు చేస్తున్నారు.