దారుణం..అర్ధరాత్రి ఇంటికెళ్లి వివాహితను బెదిరించి అత్యాచారం

0
88

మహిళలపై, చిన్నారులపై దుండగుల అఘాయిత్యాలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు, కఠిన చర్యలు తీసుకువస్తున్నా ఆడవారిపై జరిగే అఘాయిత్యాలకు మాత్రం అరికట్టలేకపోతున్నారు పోలీసులు. ఇప్పటికే దేశంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఘోర దారుణం చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలంలో ఆదివారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. బ్రతుకుతెరువు కోసం ఓ మహిళ కిరాణాషాపు నలుపుకుంటూ..ఆమె భర్త క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేసుకుంటూ పిల్లల్ని పోషికుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన కరుణాకర్‌ అనే యువకుడు ఆ మహిళకుఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడేవాడు.

ఈ విషయంపై పెద్దమనుషుల దగ్గర సమీక్ష నిర్వహించడంతో ఇంకోసారి తప్పుగా మాట్లాడానని పెద్దమనుషుల సమక్షంలో ఒప్పుకున్నాడు. కానీ ఆ ఒంక్కర బుద్దిని మార్చుకోకుండా అర్దరాత్రి అతని భర్త లేదని గమనించిన యువకుడు ఇంట్లోకి వచ్చి అరుస్తే పిల్లలను, భర్తను చంపేస్తానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ముల్కనూర్‌ పోలీ్‌సస్టేషన్‌లో సీఐ గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ తెలిపారు.