Flash News- హాస్టల్​లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య..భోజనమే కారణమా?

BTech student commits suicide in hostel

0
89

తెలంగాణ: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ జేబీఐటీ కళాశాలలో బీటెక్​ రెండో ఏడాది చదువుతున్న విద్యార్థి విజయ్​ భాస్కర్​ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిన్న రాత్రి కళాశాల వసతి గృహంలో విజయ్​ ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. అయితే కుటుంబ సభ్యులు రాకముందే మృతదేహాన్ని పోస్టుమార్టం పంపివ్వడం అనుమానాలకు తావిస్తోంది. విద్యార్థి మృతిపై సరైన విచారణ చేపట్టాలని కోరారు.

తమకు పురుగుల భోజనం పెడుతున్నారని పలుమార్లు కళాశాల యాజమాన్యానికి మొర పెట్టినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమ సమస్యలు వినే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం తీరు సరిగా లేకపోవడంతోనే విజయ్​ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు ఆందోళన చేపట్టారు.