Breaking News- వరంగల్‌లో డ్రగ్స్‌ కలకలం..బీటెక్ విద్యార్థుల అరెస్ట్

BTech students arrested in Warangal

0
143

వరంగల్‌లో డ్రగ్స్‌ కలకలం రేపాయి. డ్రగ్స్‌ విక్రయిస్తూ పట్టుబడిన ఇద్దరు బీటెక్‌ విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కొకైన్‌తోపాటు 15 గ్రాముల చరాస్‌, 36 మత్తు టాబ్లెట్లు సీజ్‌ చేశారు. విద్యార్థుల నుంచి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి విద్యార్థులు ఇతరులకు అమ్ముతున్నారని తెలిపారు. డ్రగ్స్‌ సేవిస్తున్న మరో నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులు బీటెక్‌ విద్యార్థులు రోహన్‌, కాశీరావుగా పోలీసులు గుర్తించారు.