బస్సు- బైక్ ఢీ..ముగ్గురు యువకులు దుర్మరణం

0
88

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళితే..నారాయణపేట జిల్లా కోస్గి మండలం గూడుమాల్ గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై వస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు యువకులు బండ్లదేవుని పల్లి గ్రామానికి చెందిన వారు కాగా ఒకరు గూడుమాల్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ దుర్ఘటనతో ఆ గ్రామాల్లో కొండంత విషాదం నెలకొంది.