Breaking: బస్సు ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీ..20 మంది సజీవ దహనం

0
88
Kabul

పాకిస్థాన్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారీ ప్రాణనష్టం చోటుచేసుకుంది. లాహోర్​ నుంచి కరాచీకి వెళ్తున్న బస్సు హైవేపై ఆయిల్​ ట్యాంకర్​ను ఢీకొట్టడంతో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. ఈ మంటల్లో చిక్కుకుని 20 మంది అక్కడికక్కడే సజీవ దహనంకాగా..మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తుచేయగా ..అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధరించారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.