చిన్న చిన్న గొడవలకు ఏకంగా విడాకులు తీసుకుంటున్న వారిని చూస్తున్నాం. ఇక ఇద్దరూ కలిసి ఉండలేము అని కోర్టు మెట్లు ఎక్కుతున్న జంటలు ఉంటున్నాయి. అయితే పెళ్లి అయ్యాక ఇలా ఉంటే పెళ్లి సమయంలో కూడా ఇలా చిన్న చిన్న గొడవలు వస్తే సర్దుకుపోవాలి, కాని ఏకంగా పెళ్లినే రద్దు చేసుకుంటున్నారు కొందరు. తాజాగా ఇదే జరిగింది. గతంలో కట్నం డబ్బులు మొత్తం ఇవ్వలేదు అని పెళ్లిళ్లు ఆగిపోయేవి, కాని ఇప్పుడు మాకు కోడి కూరలేదు, మటన్ కూర లేదు, గుడ్లు లేవు, మందు పోయలేదు ఇలాంటివి చప్పి పెళ్లిళ్లు రద్దు చేసుకుంటున్నారు. కాలం అంతలా మారిపోయింది.
జాజ్ పూర్ జిల్లా మనతిరా గ్రామంలో వివాహానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. ఇటు పెళ్లి కొడుకు ఫ్రెండ్స్, బంధువులు అందరూ వచ్చారు. విందులో మటన్ పెట్టకపోవడం తో వివాదం మొదలైంది. మాకు ఇప్పుడే మటన్ కావాలని పెళ్లికొడుకు బంధువులు అడగడంతో మటన్ లేదని పెళ్లికూతురు బంధువులు సమాధానమిచ్చారు.
చివరకు పెళ్లికొడుకు తన వివాహాన్ని రద్దు చేసుకుని. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఇంటికి వెళ్లిన ఆ వ్యక్తిని బుజ్జగించాలి అని అనుకున్నారు. కాని తర్వాత రోజు ఉదయం మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.