Flash News- హైదరాబాద్ లో గంజాయి కలకలం

0
82

హైదరాబాద్‌ లోని రాజేంద్రనగర్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. రాజేంద్రనగర్‌ పరిధిలోని చింతల్‌మెట్‌ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా..కారులో తరలిస్తున్న 43 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారని తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.