ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి గుప్పుమంటోంది. గంజాయి సాగు, అక్రమ రవాణా వ్యాపారం హద్దూ అదుపూ లేకుండా సాగుతోంది. రోడ్డు, రైలు, సముద్ర మార్గాల్లో రవాణా అవుతున్న గంజాయి..ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట పట్టుబడుతూనే ఉంది.
తాజాగా హైదరాబాద్లోని ఎల్‌బీనగర్‌లో 110 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు అంతర్‌రాష్ట్ర నేరగాళ్లను అరెస్టు చేశారు. ఏవోబీ నుంచి మహారాష్ట్ర, నాగపుర్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.