టాటా షోరూమ్ మొదటి అంతస్తు నుంచి కారు బోల్తా కొట్టింది. కొనుగోలుదారుడు మొదటి అంతస్తులో కారును స్టార్ట్ చేసిన సమయంలో ప్రమాదవశాత్తు అక్కడి నుంచి బయటకు దూసుకొచ్చింది కారు. కింద మరో కారుపై బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం ధ్వంసమైంది. కారు కొనుగోలుదారుడికి, ఒక బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన ఎల్బీ నగర్ పరిధిలోని అలకాపురి లో ఉన్న టాటా కార్ల షోరూంలో సోమవారం సాయంత్రం జరిగింది. వీడియో లింక్ కింద ఉంది చూడొచ్చు..