కొత్తగా పెళ్లైంది అయినా మాజీ లవర్ తో చాటింగ్ చివరకు దారుణం

Chatting with an ex-lover even if newly married

0
82

ఆమె పేరు పూజ ఆమె బిహర్ లో ఉండేది. అయితే అక్కడ‌ రాకేష్ తో ప్రేమలో పడింది ఇద్దరూ ప్రేమించుకున్నారు కాని పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో వేరే సంబంధం చూసి ఇంట్లో వారు పూజ‌కి పెళ్లి చేశారు. రాజేంద్రన్ వర్మ అనే వ్యక్తిని వివాహం చేసుకుని ఇక్కడ నగరానికి వచ్చింది. అయితే భార్య భర్త బాగానే ఉన్నారు. కానీ ఇటీవల మళ్లీ ఆమె ప్రియుడితో ఫోన్ కాల్స్ మాట్లాడ‌టం మొద‌లుపెట్టింది. ఈ సమయంలో ఆమెని తనతో రావాలి అని కోరాడు ఆమె నిరాకరించింది.

అయితే తన స్నేహితుడిని తీసుకుని రాకేష్ నగరానికి వచ్చాడు. ఆమెని తనతో రావాలి అని కోరాడు. ఆమె మాత్రం తాను రాను అని చెప్పింది దీంతో విచ‌క్ష‌ణ‌ కోల్పోయి ఆమెని ఊపిరాడకుండా చేసి హత్యచేశాడు. ఆ తర్వాత ఆమె ఆభరణాలను తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు.

దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇలా వివాహం అయిన తర్వాత ప్రియుడితో ఆమె మాట్లాడటం వల్ల అతను మళ్లీ ఆమె లైఫ్ లోకి వచ్చాడు. చివరకు భర్తకు ఏ విషయం తెలియదు. డ్యూటీ నుంచి వచ్చేసరికి చనిపోయి ఉంది భార్య‌.