ఓ కేసు విషయంలో యువకుడిని సీఐ చితకబాదారు. దీనితో మనస్థాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఇచ్చిన దర్యాప్తుపై మండపేట పట్టణ సీఐ కే. దుర్గాప్రసాద్ ను సస్పెండ్ చేస్తూ ఏలూరు రేంజ్ డీఐజీ కె. వి. మోహన్ రావు ఐపీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏం జరిగిందంటే..?
మైనర్ బాలిక ప్రేమ వ్యవహారంలో యువకుడిని సిఐ పోలీసు స్టేషన్ కు పిలిచి చితకబాదాడు. దీనితో తీవ్ర మనస్థాపం చెందిన ఆ యువకుడు అవమానంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనితో యువకుడి కుటుంబ సభ్యులు మృతదేహంతో కలువపువ్వు సెంటర్లో ధర్నా చేశారు. ఈ విషయం జిల్లా ఎస్ పి ఎమ్. రవీంద్రబాబు విచారణ చేపట్టారు. సిఐ కొట్డడవల్లే మృతి చెందాడని నిర్దారణ కావడంతో డిఐజికి రిపోర్ట్ పంపడంతో అయన సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.