సీఐ ప్రేమయ్య సస్పెన్షన్..ఆదేశాలు జారీ చేసిన డీజీపీ

0
122

ఏపీ: అవినీతిని అరికట్టాల్సిన పోలీసులే అక్రమాలకు పాల్పడుతున్నారు. అయితే తప్పు చేస్తే ఎంతటివారైనా శిక్ష తప్పదని మరోసారి ఈ సంఘటనతో నిరూపితమైంది. గతంలో గుంటూరు జిల్లా నల్లపాడు సీఐగా విధులు నిర్వర్తించిన ప్రేమయ్యను సస్పెండ్ చేస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. నల్లపాడు సీఐగా పని చేసిన సమయంలో అతనిపై పలు ఆరోపణలు వచ్చాయి. డీజీపీ ఆదేశాల మేరకు సౌత్ డీఎస్పీ ప్రశాంతి దర్యాప్తు చేసి డీజీపీ కార్యాలయానికి నివేదిక అందజేశారు. ఈ మేరకు వీఆర్ లో ఉన్న సీఐ ప్రేమయ్యను సస్పెండ్ చేస్తూ డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి.