వరంగల్ కేయూలో ఘర్షణ..విద్యార్థులకు గాయాలు

Clash in Warangal KU..injuries to students

0
87

తెలంగాణ: వరంగల్​ కాకతీయ యూనివర్సిటీలో అర్ధరాత్రి సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్సిటీ పీజీ విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి కట్టెలు, బకెట్లతో కొట్టుకున్నారు. విద్యార్థి గ్రూపుల మధ్య ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ఒక చిన్న విషయంలో తలెత్తిన గొడవ మాటామాటా పెరిగి పెద్దదైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న కాకతీయ యూనివర్సిటీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.