విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన కొందరు టీచర్లు వక్ర బుద్దితో వేధింపులకి గురిచేస్తున్నారు. తమ కోరిక తీర్చకపోతే మిమ్మల్ని పరీక్షల్లో పాస్ చేయమని బెదిరిస్తున్నారు. ఇలా లైంగిక వేధింపులకి గురిచేస్తున్నారు. చివరకు వీరి గురించి పోలీసులకు ఆ విధ్యార్దినులు కంప్లైంట్ ఇస్తే వీరి బండారం బయటపడుతుంది. ఒడిశాలోని జాజ్పూర్ జిల్లాలో ఇలాంటి ఘటన జరిగింది.
ఓ కీచక లెక్చరర్ మగ విద్యార్థులను సైతం వదలకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చిట లోని ఓ కాలేజీలో లెక్చరర్గా పని చేస్తున్న నిరంజన్ పాండా విద్యార్థులను లైంగికంగా వేధింపులకు గురిచేసేవాడు. తను చెప్పిన సమయంలో తన ఇంటికి రావాలి అని అడిగేవాడు. రాత్రి పూట నాతో ఉండాలి లేకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తా అని బెదిరించేవాడు.
లెక్చరర్, విద్యార్థుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, వాట్సాప్ మెసేజ్ల స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్గా మారాయి.ఓ విద్యార్థి జాజ్పూర్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు చివరకు అతనిని అరెస్ట్ చేశారు పోలీసులు.