Flash: ఏపీలో కలకలం..మద్యం తాగి ఇద్దరు మృతి

0
89

ఏపీలో కలకలం రేగింది. బాపట్ల జిల్లా రేపల్లె మండలం పోటుమెరకలో గంట వ్యవధిలో ఇద్దరు వృద్ధులు మృతి ఇప్పుడు స్థానికులను కలవరపెడుతుంది. రేపల్లె శివారు ఇసుకపల్లిలోని ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి మద్యం తెచ్చుకొని తాగిన తర్వాతే వృద్ధులు అస్వస్థతకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. వారిని ఆసుపత్రిలో చేర్పించగా..గరికపాటి నాంచారయ్య, రేపల్లె రత్తయ్య అనే ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.