హైదరాబాద్ లో కలకలం..పాతబస్తీలో యువకుడి దారుణ హత్య

0
87

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. పాతబస్తీలో ఓ యువకుడు దారుణహత్యతో స్థానిక ప్రజలు ఉలిక్కిపడ్డారు. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడిపై దుండగులు విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి చంపారు. హత్యకు గురైన యువకుడు అబూబకర్ అమూదిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.