కరోనా కేసులు తగ్గినా దేశంలో నిన్న రికార్డ్ స్ధాయిలో మరణాలు

Corona death rate increased in India

0
151

ఓ పక్క దేశంలో కరోనా కాస్త శాంతిస్తోంది అని అందరూ అనుకుంటున్నాం. నాలుగు లక్షల నుంచి లక్షలోపు కేసులు వచ్చాయని తీవ్రత తగ్గిందని భావిస్తున్నాం. కానీ మరణాలు మాత్రం మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే నిన్న ఒక్క రోజే రికార్డు స్ధాయిలో మరణాలు నమోదు అయ్యాయి.

గతంలో ఎన్నడూ లేని విధంగా గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో బుధవారం కరోనా బారిన పడి 6,148 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ ఇన్ని మరణాలు నమోదు కాలేదు ఇదే తొలిసారి.

గత 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 94,052 కేసులు నమోదైతే, 6148 మరణాలు సంభవించాయి. ఇక పాజిటీవ్ రేటు తగ్గుతోంది రికవరీ రేటు పెరుగుతుంది. కొన్ని ఆస్పత్రుల్లో బెడ్స్ ఖాళీ అవుతున్నాయి. ఇది కాస్త ఊపిరిపీల్చుకునే వార్త అనే చెప్పాలి. అయితే కేసులు తగ్గుతున్నాయని మళ్లీ నిబంధనలు పట్టించుకోకుండా, జాగ్రత్తలు పాటించకపోతే అసలుకే ముప్పు అంటున్నారు నిపుణులు.