వనస్థలిపురంలో కరోనా మర్డర్ : భార్యను చంపి.. కరోనా అని నమ్మించి.. తుదుకు..

0
123

వనస్థలిపురం లో భార్యను హత్యచేసి కరోనా తో మృతి చెందినట్టు చిత్రీకరించాడు ఆమె భర్త. అత్యంత దారుణమైన ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు…

కవిత, విజయ్ భార్యాభర్తలు. అన్యోన్యంగా సాగాల్సిన వారి కుటుంబంలో కలతలు వచ్చాయి. దీంతో ఇటీవల భార్యను చంపాడు. కరోనా కారణంగా చనిపోయిందని అందరినీ నమ్మించి అంత్యక్రియలు కూడా చేయించాడు.

అయితే తమ కూతురు కరోనా వల్ల చనిపోయిందనే విషయాన్ని ఆమె తల్లిదండ్రులు నమ్మలేకపోయారు. విజయ్ ప్రవర్తన మీద వారికి అనుమానం వచ్చింది. దీంతో తమ కూతురు కరోనాతో మరణించలేదని, పోలీస్ స్టేషన్ కవిత తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

వారి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి కవిత మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయించారు. బాధితురాలు కరోనాతో చనిపోలేదని పోస్టుమార్టం రిపోర్టులో తేల్చారు వైద్యులు. కవితను హత్య చేసి గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు చేసినట్లు తేలిపోయింది.

దీంతో పోలీసులు కరోనా పేరు చెప్పి భార్యను అంతమొందించిన విజయ్ ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు రాచకొండ పోలీసులు.