ఏపీలో పిల్లలపై ప్రతాపం చూపుతున్న కరోనా – రెండు రోజుల్లో ఎంతమంది చిన్నారులకి సోకిందంటే

Corona Third wave effect on ap children's

0
133

కరోనా సెకండ్ వేవ్ తో దేశం అల్లాడిపోతోంది. దేశంలో రోజుకి లక్షన్నర కేసులు నమోదు అవుతున్నాయి. 15 స్టేట్స్ లో లాక్ డౌన్ కర్ఫ్యూ అమలు అవుతున్నా కేసులు సంఖ్య ఇంకా తగ్లేదు. అయిత థర్డ్ వేవ్ ప్రమాదం కూడా పొంచి ఉంది. ఈసారి పిల్లలపై ఇది ప్రభావం చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక పలు రాష్ట్రాల్లో దీని ప్రభావం కనిపిస్తోంది. చాలా చోట్ల పిల్లలకు కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరుతున్నారు.

అయితే ఏపీలో కూడా చిన్నపిల్లలు కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకూ పెద్దలపై ఇది ప్రభావం చూపిస్తుందని అనుకున్నారు. కానీ పిల్లలపై కూడా పడగ విప్పుతోంది కరోనా.రెండు రోజుల వ్యవధిలో 9మంది చిన్నారులు కొవిడ్ బారిన పడ్డారు. ఈ పిల్లలు పదేళ్లలోపు పిల్లలు కావడం భయాందోళనకు గురి చేస్తోంది. తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

తొమ్మిది మంది తిరుపతి రుయా పరిధిలోని చిన్నపిల్లల ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. వీరిలో కడప జిల్లా చెందిన ముగ్గురు, చిత్తూరు జిల్లాకు చెందిన ఆరుగురు ఉన్నారు. గడిచిన 15 రోజుల్లో మరో 20 మంది చిన్నారులు చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. పిల్లలని ఎట్టి పరిస్దితుల్లో బయటకు పంపద్దు. వారికి మాస్క్ పెట్టాలి, ఫంక్షన్లు, నామకరణం, శాంతిపూజలు, అక్షరాభ్యాసం ఇలాంటి వేడుకలు వాయిదా వేసుకోవాలని వైద్యులు తెలియచేస్తున్నారు.