జింక‌కు క‌రోనా – ప‌రిశోధ‌కుల‌కి ఎలా తెలిసిందంటే

Corona to the deer

0
86

కరోనా వైరస్ మహమ్మారి కొన్ని దేశాల్లో విస్త‌రిస్తోంది. మ‌రికొన్ని దేశాల్లో త‌గ్గింది అనే చెప్పాలి. పెద్ద ఎత్తున క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయి కొన్ని దేశాల్లో. అందుకే అక్క‌డ మ‌ళ్లీ లాక్ డౌన్ పెడుతున్నారు. మాస్క్ ధ‌రించ‌క‌పోతే ఫైన్ విధిస్తున్నారు. ఓ ప‌క్క వేగంగా వ్యాక్సిన్ డ్రైవ్ చేప‌డుతున్నా కేసులు మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు.

మ‌నుషుల‌కే కాదు ఇటీవల కాలంలో జంతువులకూ సోకుతోంది ఈ క‌రోనా వైర‌స్ . తాజాగా అమెరికాలో ఓ జింకకు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఇలా జంతువుల‌కి సోక‌డంతో చాలా మంది ఆందోళ‌న చెందుతున్నారు. అయితే ఎలా సోకింది అనేది మాత్రం తెలియ‌డం లేదు.
ఓహియో రాష్ట్రంలో ఓ తెల్ల తోక జింకకు వైద్య పరీక్షలు నిర్వహించగా, అది వైరస్ బారినపడిన విషయం వెల్లడైంది.

ఈ మ‌ధ్య జంతువుల నుంచి మ‌నుషుల‌కి – అలాగే మ‌నుషుల నుంచి జంతువుల‌కి క‌రోనా సోకుతుందా అనే దానిపై ప‌రిశోధ‌న చేప‌ట్టారు ప‌రిశోధ‌కులు. ఈ స‌మ‌యంలో కొన్ని జంతువుల‌కి టెస్టులు చేశారు. అందులో జింక‌కు క‌రోనా సోకింది . ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌నం చాల చోట్ల కుక్క‌లు పిల్లులు సింహాల‌కు క‌రోనా సోక‌డం చూశాం. తొలిసారి జింక‌కు క‌రోనా సోకింది అని వింటున్నాం.