ఏసీబీ వలలో అవినీతి చేప

Corrupt fish in the ACB net

0
146

వడ్డాది ఏపీ ఈపీడీసీఎల్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పని చేస్తున్న మహేశ్వరరావు ఏసీబీ అధికారులకు చిక్కారు. అనకాపల్లి ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద రెండు లక్షలు లంచం తీసుకుంటుండగా ఎఈ మహేశ్వరరావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఏపీ ఈపీడీసీఎల్ లో కాంట్రాక్టర్ లేబర్ గా రమణ పని చేస్తున్నారు. అయితే పెండింగ్ లో ఉన్న బిల్లులు నిమిత్తం మహేశ్వరరావు 2 లక్షలు డిమాండ్ చేశారు. కాంట్రాక్టు రమణ స్వస్థలం నర్సీపట్నం కాగా ఆయన నిన్న విశాఖపట్నంలో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీనితో శుక్రవారం లంచం తీసుకుంటుండగా ఎఈ మహేశ్వరరావును పట్టుకున్నారు.