Breaking News- దారుణం..ప్రేమజంట ఆత్మహత్య

0
84

ఇద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నారు. కలిసి ఉంటే ఎంత సంతోషంగా గడుపుతామో అంటూ ఊసులు చెప్పుకున్నారు. కానీ చివరికి ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. ఏపీలోని కృష్ణా జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.

కంచికర్ల మండలం మొగులూరుకు చెందిన యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తమ ప్రేమను పెద్దలకు తెలియజేశారు. వారు ఒప్పుకోలేదు. వారిని ఒప్పించటానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. ఒకరిపై ఒకరికి ఎంత ఇష్టముందో తెలియజేశారు. ఒకరికి ఒకరు లేకుండా బతకలేమన్నారు. తాము కలిసి బతికితేనే తమ భవిష్యత్తు బాగుంటుందని నచ్చజెప్పాలని చూశారు.

ప్రేమ జంట ఎంత నచ్చజెప్పినా పెద్దలు ఒప్పుకోకపోవటంతో ఒక నిర్ణయానికొచ్చారు. కలిసి జీవించలేమని తెలిసి కలిసైనా చనిపోవాలనుకున్నారు. అందుకే ఆత్మహత్యకు యత్నించారు. ప్రాణాపాయం నుంచి బయటపడినా..ఈ రోజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.