Flash News : కరోనా సోకి హోం గార్డ్ మృతి

0
96

కరోనా రక్కసికి ఒక హోంగార్డు బలయ్యారు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు సుధాకర్ రెడ్డి (43) కరోనా సోకడంతో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. కరోనా సోకడంతో గాంధీ ఆసుపత్రిలో తో చికిత్స అందించారు. కానీ కోలుకోలేకపోయారు.

సుధాకర్ రెడ్డి వ్యాక్సినేషన్ కూడా వేయించుకున్నాడు. రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ కోలుకోలేకపోవడం ఆందోళన కలిగించే అంశం.

హైదరాబాద్ లో ఇటీవల ధర్నాలు, రాస్తారోకోలు, బోనాలు సందర్భంగా బందోబస్తు విధులు నిర్వహించిన పోలీస్ సిబ్బందిలో పలువురు కోవిడ్ బారీనా పడ్డారు. అందులో సుధాకర్ రెడ్డి మాత్రం కోవిడ్ కు బలయ్యారు.