కరోనాతో జర్నలిస్టు మృతి వార్త బాధించింది : మంత్రి తలసాని

0
103

జర్నలిస్టు కావటి వెంకట్ యాదవ్ మృతి వార్త తనను ఎంతో కలచి వేసిందని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇటీవల కరోనా తో చికిత్స పొందుతూ మరణించిన వార్త పత్రిక బ్యూరో చీఫ్ వెంకట్ కుటుంబ సభ్యులు అయిన వెంకట్ భార్య రమాదేవి, కూతురు వినీత, కుమారుడు రోహిత్ లు శనివారం మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసంలో కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి వెంకట్ తో తనకు ఉన్న బాంధవ్యాన్ని గుర్తు చేసుకున్నారు. వెంకట్ కుటుంబ సభ్యులకు మంత్రి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. భవిష్యత్ లో ఎలాంటి అవసరం ఉన్నా తాను అండగా ఉండి సహకరిస్తానని హామీ ఇచ్చారు