పిల్లల కోసం దారుణం..భార్య సహకారంతో 16 నెలలు ఆ మహిళపై అత్యాచారం

Cruelty for children .. Rape of that woman for 16 months with the help of wife

0
98

మధ్యప్రదేశ్‌లో అత్యంత దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ దుర్మార్గుడు పిల్లల కోసం ఒక మహిళను ఏకంగా 16 నెలల పాటు నిర్భంధించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే ఉజ్జయినిలో బరోడా గ్రామానికి చెందిన రాజ్‌పాల్‌ సింగ్‌- చంద్రకాంత దంపతులకు గతంలో ఇద్దరు పిల్లలు జన్మించి చనిపోయారు. దీంతో నాగ్‌పూర్‌కు చెందిన మహిళ సహాయంతో తల్లిదండ్రులు అవుదామని భావించారు.

అందులో భాగంగానే తనకు తెలిసిన కొందరి వ్యక్తుల సహకారంతో 16 నెలల క్రితం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన 21 ఏళ్ల మహిళను ఉజ్జయినికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత తన భార్య చంద్రకాంత సహాయంతో పలుమార్లు ఆ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

బాధితురాలు ఇటీవల బిడ్డను ప్రసవించడంతో నిందితుడు ఆమెను బస్టాండ్‌లో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజ్‌పాల్‌ సింగ్‌ దంపతులతో పాటు వీరికి సహకరించిన వీరేంద్ర, కృష్ణపాల్‌, అర్జున్‌లపై హ్యూమన్‌ ట్రాఫికింగ్‌, అత్యాచారయత్నం, కిడ్నాపింగ్‌ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.