క‌రెంట్ షాక్ – ఒక‌రిని కాపాడ‌దామ‌ని వెళ్లి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు

Current shock - One went to the rescue and six lost their lives

0
83

మధ్యప్రదేశ్‌లో ఛతార్ పూర్ జిల్లాలోని మహాజ్వాల గ్రామంలో దారుణం జ‌రిగింది.
కరెంట్ షాక్ తగిలి ఒకే కుటుంబంలో ఆరుగురు మర‌ణించారు. ఒకరిని కాపాడేందుకు వెళ్లి అందరూ మృత్యువాతపడ్డారు. ఒకరికి క‌రెంట్ షాక్ కొట్టింది. వారిని ఆ ప్ర‌మాదం నుంచి రక్షించాలి అని మ‌రొక‌రు ఇలా మొత్తం ఆరుగురు మ‌ర‌ణించారు.

ఓ ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. దాని పైకప్పు స్లాబ్ వేశారు. అయితే దానికోసం ఉపయోగించిన ఐరన్ ప్లేట్స్‌ను తొలగించేందుకు ఇంట్లో ఉన్న ఒకరు ట్యాంక్‌లోకి దిగారు. అక్క‌డ విద్యుత్ వైర్లు ఉన్నాయి. దీంతో అది ఐరెన్ పైకి వ్యాపించింది. అలా ఒక‌రికి క‌రెంట్ షాక్ కొట్టింది.వారిని కాపాడేందుకు ఇంకొకరు వెళ్లారు. అలా ఒకే ఫ్యామిలీకి చెందిన ఆరుగురు వ్యక్తులకు కరెంట్ షాక్ తగిలింది.

వారిని స్థానికులు గమనించి ఆస్పత్రులకు తరలించారు. అప్ప‌టికే వారు చనిపోయారు అని వైద్యులు తెలిపారు. ఈ దారుణ‌మైన ఘ‌ట‌నతో అంద‌రూ ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. వంద‌లాది మంది అక్క‌డకు చేరుకున్నారు. ఇలాంటి ప‌నులు చేయించిన స‌మ‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి అని అధికారులు తెలిపారు.