మహిళా మండలి పేరుతో దందా..11 మంది మహిళల అరెస్ట్

Danda in the name of Mahila Mandali..11 women arrested

0
100

వారంతా మహిళా మండలిలో సభ్యులు. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే వారికి సర్ది చెప్పి సమస్యను పరిష్కరించాలి. అలాగే ఆ మండలిలో ఉన్న సభ్యులకు మంచి, చెడు చెబుతూ మండలికి మంచి పేరు తీసుకురావాలి. అలాంటిది పోయి వారే అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ ఘటన తెలంగాణలో జరిగింది.

వివరాల్లోకి వెళితే..మంచిర్యాలకు చెందిన ఓ మహిళా మండలిలో 11 మంది సభ్యులున్నారు. వారంతా మహిళా మండలిని అడ్డం పెట్టుకొని భార్య భర్తల పంచాయతీలు, భూ దందా, సెటిల్ మెంట్లు చేస్తున్నారు. ఈ సెటిల్ మెంట్ కు గానూ వారు డబ్బులు వసూలు చేసేవారు.

ఎట్టకేలకు విషయం తెలుసుకున్న పోలీసులు ఆ 11 మంది మహిళా సభ్యులను పట్టుకొని అరెస్ట్ చేశారు. ఇటువంటి మహిళా మండలి, యూనియన్ల పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తే పోలీసులకు చెప్పండి. మీకు న్యాయం జరుగుతుందని పోలీసులు సూచించారు.

మిగతా వివరాలు కింది ప్రెస్ నోట్ లో ఉన్నాయి గమనించగలరు.