ప్రపంచంలో డేంజర్ సరస్సు – ఈ నీరు తాగితే చనిపోతారు ఎక్కడ ఉందంటే

Danger lake in the world-This is where you will die if you drink water

0
131

ఈ ప్రపంచంలో అనేక డేంజర్ ప్లేస్ ల గురించి మనం విన్నాం. డేంజర్ జంతువుల గురించి విన్నాం. ఇలాంటి ప్రాంతాలకు వెళ్లడానికి పరిశోధకులు కూడా జంకుతారు. ఎందుకంటే మళ్లీ తిరిగి వస్తామా రామా అనే భయం కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఓ డేంజర్ సర‌స్సు గురించి చెప్పుకోవాలి.
ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సరస్సు ఇది. మాములుగా అయితే ఎక్కడైనా సరస్సులో నీరు తాగవచ్చు ,కాని ఈ సరస్సులో నీరు తాగితే మరణిస్తారు.

ఈ సరస్సు దక్షిణాఫ్రికాలోని లింపోపో ప్రావిన్స్ లో ఉంది. దీనిని ఫుండుజీ సరస్సు అని పిలుస్తారు. ఇక్కడ ఓ ప్రాచీన కథ చెబుతారు స్ధానికులు దాని ప్రకారం, ఈ సరస్సు ఇలా మారింది అంటారు. కొన్ని వందల ఏళ్ల క్రితం ఓ కుష్ఠురోగి ఈ ప్రాంతానికి వచ్చాడు. కాని అత‌ను అంత బాధ‌లో ఉన్నా అక్క‌డ జ‌నం ఎవరూ అతనికి తాగు నీరు కూడా ఇవ్వలేదు. దీంతో అతను ఇక్కడ ప్రజలని శపించి ఆ సరస్సులో దూకాడు. అప్పటి నుంచి ఈనీరు ఇలా మారింది అని చెబుతారు.

నది నీరు చాలా శుభ్రంగా ఉంటుంది . కానీ ఎవరైనా తాగారంటే చనిపోతారు. ఎన్నో పరిశోధనలు జరిగాయి ఈ స‌ర‌స్సుపై. కానీ దీని గురించి ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకూ అయిన పరిశోధనల్లో ఈ భూమిలో విషవాయువులు ఉండి ఉంటాయని, వాటి వల్ల శరీరంలో మార్పు జరిగి చనిపోతున్నారు అని అంటున్నారు.