హైదరాబాద్ లో డార్క్‌ వెబ్‌ మత్తు దందా..ముఠాల్లో స్టూడెంట్స్, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు!

0
94

దేశంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, దొంగతనాలు, కిడ్నాప్, అత్యాచారం వంటి ఘటనలు నిత్య కృత్యంగా మారాయి. ఇవి కాక యువత మత్తు పదార్ధాలకు అలవాటు పడుతూ..లైఫ్ ను చిత్తూ చేసుకుంటున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్న డ్రగ్స్ సరఫరా ఆగడం లేదు. ఇక తాజాగా హైదరాబాద్‌లో మరో మత్తుదందా గుట్టు రట్టయ్యింది.

హుమాయున్‌ నగర్‌లో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 9 లక్షల విలువైన సరకును స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ విక్రయిస్తున్న 8 మందితో పాటు 30 మంది వినియోగదారులను అరెస్ట్ చేశారు. ఇందులో ఇంజినీరింగ్‌ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఉన్నారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. డార్క్‌ వెబ్‌ ద్వారా మత్తుదందా నడిపిస్తున్నారని సీపీ తెలిపారు.

ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు నగరానికి మత్తు పదార్థాలు తీసుకురావాలంటే భయపడుతున్నారని వెల్లడించారు. కానీ, గోవా, బెంగళూరుకు వెళ్లి డ్రగ్స్‌ తీసుకువస్తున్నట్లు గుర్తించామన్నారు. డ్రగ్స్‌ మత్తులో యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటారని అన్నారు. తల్లిదండ్రులు వారిపై నిఘూ ఉంచాలని సూచించారు.