HYD: వ్యక్తి దారుణ హత్య.. పాలితిన్ కవర్లో శరీర భాగాలు!

-

Hyderabad |వ్యక్తి అనుమానాస్పద మరణం లంగర్ హౌస్‌లో తీవ్ర కలకలం సృష్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున ఓ వ్యక్తి ఆటో ట్రాలీలో కొన్ని పాలితిన్ కవర్లు తీసుకొని లంగర్ హౌస్(Langar House) దర్గా వద్దకు వచ్చాడు. ఆ కవర్లను ఫుట్ పాత్ పై వేస్తుండగా స్థానికులు గమనించి కేకలు వేస్తూ పట్టుకోబోయారు. దాంతో ఆ వ్యక్తి పారిపోయాడు. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి చూడగా కవర్లలో ముక్కలుగా నరికిన వ్యక్తి మృతదేహం కనిపించింది. విచారణలో మృతుడు కాళీ మందిరం ప్రాంత నివాసి అశోక్ అని వెళ్లడయ్యింది. ఈక్రమంలో పోలీసులు అతని అన్న రాజును అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అశోక్ సహజంగానే చనిపోయాడని చెప్పిన రాజు అంత్యక్రియలకు డబ్బు లేకపోవటంతో మృతదేహాన్ని ముక్కలుగా నరికి పారవేయాలని ప్రయత్నించినట్టు చెప్పాడు. కాగా, పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసారు. పోస్ట్ మార్టంలో వెళ్లడయ్యే వివరాలనుబట్టి సెక్షన్ మార్చి విచారణ చేస్తామని పోలీసులు చెప్పారు.

- Advertisement -
Read Also: భార్యను కిరాతకంగా చంపిన కానిస్టేబుల్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...