Breaking News- మృతదేహాల కలకలం..ఆత్మహత్యా..ప్రమాదమా?

0
92

తెలంగాణ: సంగారెడ్డి జిల్లాలో మృతదేహాలు కలకలం సృష్టించాయి. వివరాల్లోకి వెళితే శంకర్ పల్లి రైల్వే స్టేషన్  సమీపంలోని రైలు పట్టాలపై రెండు మృతదేహాలు పడి ఉన్నాయి. మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేశారు.

వీరిద్దరిది హత్యా లేక ఆత్మహత్యా లేదా ప్రమాదమా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతుల్లో ఒకరు 30 ఏళ్ల యువకుడు కాగా, మరొకరు 60 ఏళ్ల వృద్దుడిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.