వీడిన పెద్దపులి డెత్ మిస్టరీ..ఫారెస్ట్ అధికారులే సూత్రదారులు!

0
122

నల్లమల అటవీ ప్రాంతంలో ఓ పెద్దపులి హత్యకు గురైంది. అయితే పెద్దపులి మృతిపై విచారణ చేపట్టిన అధికారులు సంచలన నిజాలు వెల్లడించారు. పెద్దపులి మృతి వెనుక వేటగాళ్లతో పాటు ఫారెస్ట్ అధికారులే కీలక సూత్రదారులని అధికారులు తేల్చారు. దీనితో వారిపై వేటు పడింది.

నాలుగు రోజుల కిందట నల్లమల అటవీ ప్రాంతంలోని చలం రేంజ్‌లో మృతి చెందిన పులి మాయం అయింది. అయితే విచారణ చేపట్టిన అధికారులకు చలం రేంజిలో పెద్దపులి మృతదేహం లభ్యమైంది. అహోబిలం తెలుగుగంగ రిజర్వాయర్ వద్ద పెద్దపులి మృతదేహం గుర్తించిన అధికారులు.. పులి మృతిపై విచారణ చేపట్టారు. డీఎఫ్‌ఓ వినీత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన దర్యాప్తులో వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకొని మృతి చెందినట్లు తేలింది. దీనితో పెద్దపులిని ఫారెస్ట్ అధికారులు తెలుగు గంగ కాల్వలో పడేసినట్లు వెల్లడించారు.

విచారణలో ఫారెస్ట్ అధికారుల పాత్ర ఉందని తేలడంతో నంద్యాల ఫారెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని పెద్దకంబళూరు సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస రెడ్డి, బీట్ అఫీసర్ జేమ్స్ పాల్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేయగా.. ప్లాంటేషన్ వాచర్ బాషా, మైకేల్‌ను ఏకంగా సర్వీసు నుంచి రిమూవ్ చేశారు.