BREAKING: ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవదహనం

0
83
Kabul

హైదరాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బోయగూడలోని టింబర్ డిపోలో బుధవారం తెల్లవారుజామున భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఏకంగా 10 మంది సజీవదహనం కాగా మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. మృతులంతా బీహార్ కు చెందిన కార్మికులుగా గుర్తించారు. అయితే ఈ ప్రమాద సమయంలో 15 మంది కార్మికులు ఉన్నట్టు తెలుస్తుంది.