చేసిన తప్పులకి రెండు కుక్కలకు మరణశిక్ష – ఏం తప్పు చేశాయంటే

Death penalty for two dogs for mistakes made-What went wrong

0
86

ఇదేంటి కుక్కలకి మరణశిక్ష వేయడం ఇదెక్కడా వినలేదు అని అనుకుంటున్నారా. అవును ఇది నిజంగా జరిగింది.
పాకిస్థాన్లో రెండు పెంపుడు కుక్కలకు మరణశిక్ష విధించారు. గత నెలలో మార్నింగ్ వాక్ కోసం వెళ్లిన లాయర్ మీర్జా అక్తర్పై ఈ రెండు కుక్కలు దాడి చేశాయి. దీంతో లాయర్ కి చాలా కోపం వచ్చింది. ఆయన తీవ్ర గాయాలపాలై ఏకంగా ఆస్పత్రికి వెళ్లారు.

ఈ దాడి అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఇది చూసి అందరూ షాక్ అయ్యారు. ఇక లాయర్ కూడా ఆ కుక్కల యజమానిపై కేసు పెట్టారు. ఈ రెండు జర్మన్ షెపర్డ్ కుక్కలు. మొత్తానికి లాయర్ దగ్గరకు ఆ యజమాని వచ్చి రాజీ కుదుర్చుకున్నాడు.

దీనికి లాయర్ పెట్టిన షరతులు ఏమిటి అంటే. ఆ కుక్కలను వెంటనే ఓ వెటర్నరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి విషపూరిత ఇంజెక్షన్లతో చంపేయాలని చెప్పాడు. తనకు క్షమాపణ చెప్పాలని కోరాడు. ఇలాంటి కుక్కలని ఇక ఇంట్లో పెంచుకోవద్దు అని షరతు పెట్టాడు. దీంతో అతను ఒకే చెప్పాడు. కాని దీనిపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.

https://twitter.com/asadweb/status/1409057463635165184