భర్తలను హింసించే భార్యలకు బిగ్ షాక్

0
105

భార్యలను హింసిచే భర్తల మీద బొచ్చెడన్ని గృహహింస కేసులను మనం చూసి ఉన్నాము. కొందరు మహిళలు హింసించకపోయినా కేసులు పెట్టిన దాఖలాలు ఉండగా మరికొందరు ఆ కేసులను అడ్డం పెట్టుకుని భర్త కుటుంబీకులను చెడుగుడు ఆడుకున్న ఘటనలు ఉన్నాయి. గృహ హింస కేసును నిజమైన బాధితులు ఎంతగా సద్వినియోగం చేసుకోగలిగారో… దుర్వినియోగం చేసిన వారి సంఖ్య కూడా బాగానే ఉంది.

అయితే ఢిల్లీ హైకోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించిం. అదేమంటే.. భర్తను వేధింపులకు గురి చేసే భార్యపైనా గృహ హింస కేసు పెట్టొచ్చని. ఈ తీర్పు సంచలనం రేపుతోంది.

ఇటీవల ఢిల్లీ హైకోర్టు ముందుకు ఒక పిటిషన్ వచ్చింది. దాన్ని విచారించిన న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇకపై మహిళల మీద కూడా గృహ హింస కేసులు పెట్టవచ్చని తేల్చింది. భార్యలను భర్తలు వేధించడమే కాదు.. భార్యలూ భర్తలను వేధిస్తున్నారు అనే పిటిషన్ మీద విచారణ సందర్భంగా హైకోర్టు ఈ రకమైన కామెంట్స్ చేసింది. ఇకనుంచి భర్తను హింసించే భార్యపై కూడా కేసు పెట్టవచ్చని, భర్తలు కూడా న్యాయం కోసం కోర్టుల్లో పోరాడవచ్చని స్పష్టం చేసింది.

మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు 2006లో గృహహింస నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. కొందరు మహిళలు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, భార్యాబాధితులు అంటున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం భర్తను వేధించిన భార్యలపైనా గృహ హింస కేసు పెట్టవచ్చని తెలిపింది.