Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కుంభకోణంలో మనీల్యాండరింగ్‌పై ఈడీ దర్యాప్తు మెుదలుపెట్టింది. మద్యం వ్యాపారులు, డీలర్లు, సిండికేట్లకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన ఇళ్లల్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఈ సోదాలు సిసోడియా అనుచరుడు అమిత్ ఆరారా కేంద్రంగా జరుగుతున్నాయి. సమీర్ మహేంద్రు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా సోదాలు జరుగుతున్నాయి. విజయ్ నాయర్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభిషేక్‌ను సీబీఐను అరెస్ట్ చేసింది. నిన్నటితో సమీర్ మహేంద్రు కస్టడీ ముగియగా, ప్రస్తుతం సీబీఐ విజయ్ నాయర్, అభిషేక్‌ను ప్రశ్నిస్తుంది. అభిషేక్ నాయర్ కస్టడీ ముగియటంతో, మరో మూడు రోజులు కస్టడీని కోర్టు పొడిగించింది. ఇదే కేసులో రామచంద్ర పిళ్లైకి సీబీఐ నోటీసులు ఇచ్చినట్లు న్యాయస్థానానికి వివరించింది. రామచంద్ర పిళ్లైకి, ముత్తా గౌతమ్‌కు ఉన్న సంబంధాలపై విచారణ జరిపేందుకు రెండు రోజుల కస్టడీ పెంచాలని దర్యాప్తు సంస్థ కోర్టును కోరింది.