జైలు నుంచి విడుదల కానున్న డేరా బాబా..పంజాబ్ ఎన్నికలపై ఎఫెక్ట్

Dera Baba released from jail

0
85

డేరా బాబాగా పిలుచుకునే ప్రముఖ ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీం సింగ్ జైలు నుంచి విడుదల కానున్నారు. హరియాణా రోహ్​తక్ జిల్లాలోని సునారియా జైలులో ఉన్న ఆయనకు 21 రోజుల సెలవును హర్యానా ప్రభుత్వం ఈరోజు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో, ఆయన ఈ సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న తరుణంలో డేరా బాబాకు సెలవు మంజూరు చేయడం గమనార్హం. డేరా బాబాకు పెద్ద సంఖ్యలో మద్దతుదారులున్నారు. ఏ ఎన్నికలను అయినా వారు ప్రభావితం చేసేంత పరిస్థితి ఉంది. దీనితో ఈ ఎఫెక్ట్ ఎన్నికల ఫలితాలపై పడనుంది.