ఫ్లాష్: రంజాన్ పండుగ వేళ కుటుంబంలో తీరని విషాదం..

0
84

తెలంగాణాలో రంజాన్ పండగపూట తీరని విషాదం చోటుచేసుకుంది. శ్మశాన వాటికలో విద్యుదాఘాతంతో ఇద్దరు బాలురు మృతి చెందిన హృదయవిదారక ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో చోటు చేసుకుంది. వీరిద్దరు మూడు రోజుల క్రితం నుండి కనబడడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేసారు.

దాంతో పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న క్రమంలో శ్మశాన వాటికలో అబ్దుల్‌ అజీజ్‌, ముల్తాని బాబు అనే యువకుల మృతదేహాలు కనిపించాయి. అనంతరం తల్లిందండ్రులకు సమాచారం తెలియడంతో కన్నీరు మున్నీరు చేసుకున్నారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.