క‌ల‌లో శవం క‌నిపించిందా అయితే ఇది తెలుసుకోండి

Did the corpse appear in the dream

0
887

మ‌న‌లో చాలా మందికి క‌ల‌లు వ‌స్తూ ఉంటాయి. అయితే తెల్ల‌వారు జామున వ‌చ్చే క‌ల‌లు నిజం అవుతాయి అని అంటారు. స్వ‌ప్నంలో కొన్ని వ‌స్తువులు క‌నిపించినా, జంతువులు క‌నిపించినా చేటు అని న‌మ్మేవారు ఉంటారు. అంతేకాదు స్వ‌ప్న‌శాస్త్రంలో కూడా అనేక విష‌యాలు తెలియ‌చేశారు మ‌న పెద్ద‌లు.

మ‌న‌కు వ‌చ్చే కొన్ని కలలు భయాన్ని కలిగిస్తే మరికొన్ని సంతోషాన్ని కలుగజేస్తాయి.అయితే చాలా మందికి పాములు క‌ల‌లో వ‌స్తాయి. ఇలా వ‌స్తే ఏదో కీడు అని చాలా మంది భావిస్తారు. అయితే పాము కాటు వేసిన‌ట్లు క‌ల వ‌స్తేనే కీడు అని. పాము క‌నిపించి వెళ్లిపోతే ఎలాంటి చేటు ఉండ‌దు అని చెబుతారు.

అయితే మ‌రికొంద‌రికి క‌ల‌లో శవం క‌నిపిస్తూ ఉంటుంది. ఇలా క‌నిపించిన వెంట‌నే భ‌య‌ప‌డిపోతారు.
కలలో శవం కనిపిస్తే శుభ సూచికంగా చెబుతారు. ఇలా క‌నిపిస్తే అత‌నికి మంచి జ‌రుగుతుంద‌ట. ఎలాంటి భ‌యం అక్క‌ర్లేదు అంటోంది స్వ‌ప్న‌శాస్త్రం. ఇక వ్యాపారం చేసేవారికి ఇలా క‌ల‌లో శ‌వం క‌నిపిస్తే వ్యాపార‌లాభం అని కూడా చెబుతున్నారు.