రాజుల పరిపాలన కాలంలో కొందరు రాజులు రాజ్యాన్ని విస్తరించాలి అనే కాంక్షతో దండెత్తెవారు పక్క రాజ్యాలపై యుద్దానికి వచ్చేవారు. ఈ సమయంలో అక్కడ రాజ్యంలోని ఖజానా కూడా తీసుకునేవారు. అయితే ఇలా చాలా విషయాల్లో యుద్దాల గురించి విన్నాం. కాని పుచ్చకాయ గురించి యుద్దం ఎప్పుడైనా విన్నారా. నిజంగా ఆశ్చర్యకరమే.ఈ పండు కోసం వేలాది మంది ప్రాణాలు కోల్పోయారట.
రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో పుచ్చకాయను మతిరా అని పిలుస్తారు. క్రీ.శ. 1644 లో ఇక్కడ పెద్ద యుద్దం జరిగింది. అది జరగడానికి కారణం ఏమిటి అంటే ? బికనీర్ రాజ్యంలోని సరిహద్దు గ్రామం సిల్వాలో పుచ్చకాయ చెట్టు మొలకెత్తింది. నాగౌర్ సంస్థానంలోని పరిహద్దు గ్రామమైన జఖానియన్‌లో పెరిగింది. ఎందుకంటే ఇది తీగలా ఉంటుంది కాబట్టి అలా అల్లుకుంటూ వెళ్లింది.
చివరకు ఈ పండ్లు మావంటే మావి అని ఘర్షణకు దిగారు అక్కడ జనం. చివరకు ఈ గొడవ రెండు రాజ్యాల మధ్య యుద్ధానికి దారి తీసింది. ఈ యుద్ధంలో నాగౌర్ సంస్థానం ఓడిపోయిందట. చాలా మంది చరిత్ర కారులు ఈ విషయాన్ని తెలియచేశారు.