గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి..ముగ్గురు దుర్మరణం

0
81

కర్ణాటక గణేశ్‌ నిమజ్జనం ఉత్సవాల్లో అపశ్రుతి జరిగింది. హోసల్లి గ్రామంలో వినాయకుడ్ని నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా విద్యుదాఘాతానికి గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు.. గ్రామంలో ఏర్పాటు చేసిన గణేశ్‌ విగ్రహాన్ని.. నిర్వాహకులు ట్రాక్టర్‌పై ఏర్పాటు చేసిన మండపంలో పెట్టి పెట్టి నిమజ్జనానికి తీసుకెళ్లారు. నిమజ్జనం అనంతరం ఆరుగురు గ్రామస్థులు ట్రాక్టర్‌ ట్రాలీపై కూర్చుని తిరుగుముఖం పట్టారు. ఈ క్రమంలో వారికి విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు.