రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కఠిన చట్టాలు తెచ్చిన శిక్షలు వేసిన నిందితుల్లో మార్పు రావడం లేదు. తెలంగాణలో జరిగిన దిశ తరహా ఘటన కర్ణాటకలోని రామసంద్రలో జరిగింది. గుర్తు తెలియని మహిళ మృతదేహం పూర్తిగా కాలిపోయి నిర్మానుష్య ప్రదేశంలో కనిపించింది. మృతురాలి వయసు 25 నుంచి 30 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. మహిళపై అత్యాచారం చేసి.. అనంతరం హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.