వికటించిన చుక్కల మందు..నిండు ప్రాణం బలి..పరారీలో ఆర్ఎంపీ డాక్టర్

0
83

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెంలో విషాదం నెలకొంది. దుమ్ముగూడెం మండలంలోని నర్సపురం గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుడు వేసిన చుక్కల మందు వికటించింది. దీనితో పైడిగూడెం గ్రామానికి చెందిన ఏడాదిన్నర చిన్నారి దుర్మరణం చెందింది. వైద్యుడు ఇంటి ముందు బాధిత కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. కాగా ప్రస్తుతం ఆర్ఎంపీ వైద్యుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది.