అబ్బాయిలు జర జాగ్రత్త లిఫ్ట్ అడిగింది కదా అని ఇవ్వకండి – ఇలాంటి వారు ఉంటారు

అబ్బాయిలు జర జాగ్రత్త

0
121

రోడ్డుపై ఒంటరిగా అమ్మాయి నిలబడుతుంది లిఫ్ట్ కావాలి అని అడుగుతుంది. పాపం అమ్మాయి కదా అని లిఫ్ట్ ఇస్తే మీ జేబుకి చిల్లు పడినట్టే. అంతేకాదు మీ దగ్గర బంగారం ఉంటే అవి కూడా ఆమెకు ఇచ్చేయాల్సిందే. ఇలాంటి కిలాడి లేడీని పోలీసులు పట్టుకున్నారు. 22ఏళ్ల యువతిని విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గుర్ల మండలానికి చెందిన యువతి వ్యసనాలకు బానిసగా మారింది. ఆమెకు తల్లి లేదు. తండ్రి ఉన్నా పట్టించుకునే వాడు కాదు. ఇక చదువు మానేసి కూలి పనులకి వెళ్లేది. దీంతో ఆ డబ్బులు సరిపోక వ్యసనాలకు అలవాటు పడింది.
ఇలా బైక్ పై వెళ్లేవారిని ఆపి లిఫ్ట్ అడిగేది. ఇలా మధ్యలోకి వెళ్లగానే డబ్బులు ఇవ్వాలి అని బెదిరించేది . కాదు అంటే తనని ఏడపించావని అఘాయిత్యానికి పాల్పడ్డావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరింపులకు పాల్పడుతుంది.

ఇక చాలా మంది భయపడి వెంటనే ఆమె అడిగిన డబ్బులు, బంగారం ఇచ్చేవారు. తాజాగా ఓ యువకుడిని ఇలా బెదిరించి డబ్బులు తీసుకుంది. అతను విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆమెని సీసీ టీవీ పుటేజీ ఆధారంగా పట్టుకున్నారు. అబ్బాయిలు జర జాగ్రత్త.